విషయం లేని వ్యక్తి తెలంగాణకు సీఎం.. మనకిదో శాపం
ఉస్మానియా యూనివర్సిటీ: విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాషా్ర్టనికి సీఎం కావడం తెలంగాణ ప్రజలకు శాపమని మాజీ మంత్రి, ఎమ్మేల్యే గుంతకండ్ల జగీదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ను ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ప్రారంభించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీల అమలు నుంచి తప్పించుకుంటోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ, ప్రతి ఒక్కరు ప్రశ్నించే దిశగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారని దుయ్యబట్టారు. ఓయూ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. కనీస విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల పాలిట శాపమని అన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల మాజీ చైరన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమల్ల రాకేశ్, బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, తొట్ల స్వామి యాదవ్, మంద సురేశ్, పడాల సతీశ్, కడారి స్వామి యాదవ్, టైగర్ రఘురాం, అవినాశ్, చందు, వెంకట్, నవీన్ గౌడ్, జంగయ్య, మిథున్ ప్రసాద్, నాగారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేతకు పుట్టినరోజు పండుగ..: మాధవరం
మియాపూర్, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. వాడవాడలా విస్తృత కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిర్వహించనున్న వృక్షార్జన కార్యక్రమ పోస్టర్ను ఎమ్మెల్యే కృష్ణారావు కూకట్పల్లిలోని తన నివాసంలో శనివారం ఆవిష్కరించారు. మొక్కలు నాటి వాటిని సంపూర్ణంగా పరిరక్షించి కేసీఆర్కు కానుకగా అందిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు శ్యామల రాజు, 123 హైదర్ నగర్ డివిజన్ సుబ్బరాజు, మియాపూర్-గోపరాజు శ్రీనివాస్, రోజా, శేరి లింగంపల్లి -రవి యాదవ్ పాల్గొన్నారు.
కేసీఆర్ జన్మదినాన.. మొక్కల నాటు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఇంజాపూర్లో అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్ మొక్కలు నాటారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్ జన్మదినం అంటే రాష్ర్టానికే పండుగ అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, మధు, రాజేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.
మణికొండలో ఘనంగా కేసీఆర్ క్రికెట్ టోర్నీ..
మణికొండ, ఫిబ్రవరి 15: మణికొండ మున్సిపాలిటీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్ము ఉపేందర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17ను పురస్కరించుకొని కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ మండలం పరిధిలోని పెద్ద మంగళారంలోని హాట్ స్పాట్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ ట్రోఫీ పోటీలలో 14 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన యువకులతో కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ పేరు మీద ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శనం ఎంతో ప్రాముఖ్యమైందని ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి తెలిపారు. అవాస ప్రైడ్, గరుడా, వీటీ నైట్స్, ఎక్స్ట్రీమ్ 11, ఔరేలిలా అవెంజర్స్, వారియర్స్ 11, ఏస్ అట్లాంటిస్, జై భవాని, ఈగెల్స్, జై వీర్ హనుమాన్, జీ 2 ైస్టెక్రర్స్ , జై హనుమాన్ 11, ఆల్ఫా 11, ఐరా స్పోరట్స్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు ఫైనల్ మ్యాచ్ కొనసాగించి విజేతలకు బహుమతులను ప్రకటిస్తామని నిర్వాహకులు ఉపేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నీలకంఠం శివరామకృష్ణ, చావా సందీప్, తెల్ల జస్వంత్, ఒంటెద్దు రాజశేఖర్ రెడ్డి, షేక్ ఆరిఫ్ మహమ్మద్, బండారు ఉదయ్ కిరణ్ మణికొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గుట్ట మీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, రామసుబ్బారెడ్డి, బుద్దోలు బాబు, షేక్ ఆరిఫ్, దిలీప్, సుమ నళిని, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ శనివారం ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమల్ల రాకేశ్, బీఆర్ఎస్ నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, తొట్ల స్వామి, వీరబాబు, మంద సురేశ్, పడాల సతీశ్, కడారి స్వామి యాదవ్, టైగర్ రఘురాం, జంగం అవినాష్, గదరాజు చందు, వేల్పుకొండ వెంకట్, నవీన్ గౌడ్, జంగయ్య, మిథున్ ప్రసాద్, వెంకట్, నాగేందర్, శ్రీకాంత్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.