సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): అత్యాధునికమైన ఎస్యూవీ టిగువాన్ ఆర్ లైన్‌ను వోక్స్ వ్యాగన్ డెక్కన్ షోరూమ్ శనివారం లాంచ్ చేసింది. ఎల్బీ నగర్, మెహిదీపట్నంలోని మోడీ వోక్స్ వ్యాగన్ డెక్కన్ షోరూమ్‌లలో ఈ కారును అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కి వోక్స్ వ్యాగన్ రీజినల్ మేనేజర్ ఉమేశ్ శర్మ, మోడీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థ్ మోదీ, వోక్స్ వ్యాగన్ డెక్కన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్థ్ మోదీ మాట్లాడుతూ…టిగువాన్ ఆర్ లైన్ మోడల్ వోక్స్ వ్యాగన్ ఇన్నొవేషన్, నాణ్యత పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిరూపం. హైదరాబాద్‌లోని మా కస్టమర్లకు ఈ ప్రీమియం కారును అందించడంపై మేం ఉత్సాహంగా ఉన్నాం అని తెలిపారు.