మాదాపూర్, మార్చి 3: డ్రైనేజీ మ్యాన్‌హోల్ లీకేజీపై మార్తాండనగర్ కాలనీలోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లీకేజీ కావడంతో మురుగునీరు భూమి లోపలికి చేరి బోరు నీటిని కలుషితం చేస్తున్నాయని తెలిపారు. కొండాపూర్ డివిజన్ మార్తాండ నగర్లో గత కొద్దిరోజులుగా డ్రైనేజీ మ్యాన్ హోల్ లీకేజీ కావడంతో భూమిలో చేరి బోర్ ద్వారా కలుషిత నీరు ఇండ్లలోకి వస్తుందని స్థానికులతో కలిసి అసోసియేషన్ సభ్యులు జలమండలి జనరల్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ .. కొండాపూర్ సెక్షన్ పరిధిలోని మార్తాండ నగర్ కాలనీ, గణేశ్ టెంపుల్ 40 ఫీట్ రోడ్డులో రోడ్డు నెంబర్ 5,6 లలో డ్రైనేజీ మ్యాన్ హోల్ లీకేజీ కావడంతో అవి కాస్త భూమిలో ఇంకి ఇండ్లలోకి కలుషిత నీరు వస్తుందని తెలిపారు. నీరు నలుపు, పసుపు రంగులో వచ్చి దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఈ రెండు రోడ్డు నెంబర్లలో బోర్ నీటిని వాడటం మానేసి గోదావరి నీళ్ల పై ఆధారపడుతున్నారని తెలిపారు. అవి కూడా సరిపోక ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నట్లు పేర్కొన్నారు. మ్యాన్ హోల్ లు నాణ్యతతో నిర్మించకపోవడంతో, మ్యాన్ హోల్ ల కింద కంకర మాల్ ని సరిగా కలిపి వేయకపోవడంతో పంది కొక్కులు మ్యాన్ హోల్ రంధ్రాల నుంచి మట్టి లాగడం, రాఘవేంద్ర కాలనీ మ్యాన్ హోల్ సరిగా లేకపోవడంతో అవి కూడా భూమిలో చేరి పిల్లలకి కలిసి నీరు వస్తుందని తెలిపారు. కలుషిత మీద ఇళ్లలోకి రావడంతో స్థానిక కాలనీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు తగిన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించగలరని కోరారు.