సోమాజిగూడ: సోమాజిగూడలోని జయగార్డెన్స్లో బుధవారం విల్లామేరీ మహిళా కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు జరిగాయి. ర్యాంప్ వాక్, నృత్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో విద్యార్థినులు తళుక్కుమన్నారు.
సోమాజిగూడలోని జయగార్డెన్స్లో విల్లామేరీ మహిళా డిగ్రీ కళాశాల ఫేర్వెల్ వేడుకలు అలరించాయి. ఈ వేడుకలను కళాశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ డాక్టర్ ఫిలోమినా, కార్యదర్శి చిన్నమ్మ, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన ర్యాంప్ వాక్‌లో మిస్ విల్లా మేరీగా జాహ్నవి వంతరం, రన్నరప్‌లుగా కుష్బూ యాదవ్, కుష్బూ దుగర్, మహితా, కుషీ అగర్వాల్ నిలిచారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు రేవతి, బాలసుబ్రహ్మణియన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.