సిటీబ్యూరో: నిలోఫర్ దవాఖాన కొత్త సూపరింటెండెంట్‌గా డా. విజయ్‌కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డా.రవికుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ బాధ్యతలను డా.విజయ్‌కుమార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
కాగా నిలోఫర్ దవాఖాన నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డా.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కువగా నిరుపేద రోగులు వచ్చే నిలోఫర్ దవాఖానలో మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.