సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): సాంకేతికత, డిజిటలైజేషన్ను పకడ్బందీగా అమలు చేస్తూ అవినీతిని పూర్తి స్థాయిలో తుద ముట్టించవచ్చని నగర అదన పు సీపీ శిఖా గోయెల్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా బ్యాంక్ అఫ్ బరోడా జోనల్ కార్యాలయంలో డిజిటల్ వేదికగా తెలంగాణ, ఏపీలోని అన్ని రీజినల్, బ్రాంచ్ కార్యాలయాల సిబ్బందితో ‘స్వాతంత్య్ర భారత్ @75’ అనే అంశంపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయెల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశాన్ని, సమాజాన్ని అవినీతి రహితంగా మార్చాలనే పట్టుదలతో ముందుకు పోవాలన్నారు. అనంతరం బ్యాంక్ జోనల్ హెడ్ మన్మోహన్ గుప్త మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాలలో అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లాభాయ్ జయం తి వస్తుందని గుర్తు చేశారు. సిబ్బంది నిజాయితీగా పనిచే స్తూ తమ విధులను కొనసాగించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ జోనల్ హెడ్ వినోద్ బాబు, జోనల్ అఫీసర్ వై. శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
విజిలెన్స్ వారోత్సాలలో భాగంగా సోమవారం కెన రా బ్యాంకు సర్కిల్ కార్యాలయం నుంచి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వరకు వాకథాన్ నిర్వహించారు. సర్కిల్ హెడ్, ఛీప్ జనరల్ మేనేజర్ కేహెచ్ పట్నాయక్ జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్కిల్ ఆఫీస్, రీజీనల్ హెడ్ అఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.