Sunkishala Project | పెద్దవూర ఆగస్టు 18 : నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై ఆదివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యులు విచారణ చేపట్టారు . ఈ సందర్భంగా ఘటనకు గల కారణాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఇంత ప్రమాదం జరిగినా.. తమ దృష్టికి రాలేదని, సోషల్ మీడియా, మీడియా చానళ్ల ద్వారానే వివరాలు తెలసుకున్నామని వారు అక్కడి అధికారులకు తెలిపారు.
ఈ నష్టం ఎంత మొత్తంలో ఉంది..దీనికి కారణం ఎవరనే విషయల పై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ సంఘటన ఈ నెల 2న జరిగినా.. తమకు ఈ మధ్యే తెలిసిందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు. సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన వారిలో అడిషనల్ ఎస్పీ ఆనంద్‌కుమార్, డిప్యూటీ ఇంజినీరింగ్ బాలకృష్ణ , ప్రసాద్, శ్రీనివాస్ ఉన్నారు.