Venkatesh Chauhan | ఓట్లు వేశాం..బరాబర్ మంత్రి పదవీ అడుగుతాం
Venkatesh Chauhan | బంజారా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జాతులకు మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తోందని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు.
ఖైరతాబాద్, మార్చి 31 : బంజారా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జాతులకు మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తోందని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 60 స్థానాల్లో 45 స్థానాలు గిరిజనుల ఓట్లే కారణమన్నారు. ఓట్లు వేశాం కాబట్టే మంత్రి పదవులు అడుగుతున్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా గిరిజనులను పట్టించుకోవడమే మానేశారన్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కి మంత్రి పదువులు ఇవ్వడానికి వెనుకాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న గిరిజన జనాభాకు ఒక్క మంత్రి లేకపోవడం విచారకరమన్నారు. గిరిజన ప్రతినిధులు ముఖ్యమంత్రితో పాటు గత, ప్రస్తుత కాంగ్రెస్ ఇన్చార్జీలను కలిసినా ఫలితం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవీతో తమకు న్యాయం జరుగదన్నారు.
జనాభాలో 12 శాతం ఉన్న బంజారాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలను అణచివేయాలని చూస్తోందని, అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క గిరిజనుడు కూడా కాంగ్రెస్కు ఓటు వేయడన్నారు. తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ రాజేశ్ నాయక్, గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షులు అశోక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

