చార్మినార్, ఏప్రిల్ 18: పురాతన సంస్కృతి, సౌరభాలు రేపటి భావితరాలకు అందించే కానుకలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వెదకుమార్ (Vedakumar) అన్నారు. ప్రపంచ హెరిటేజ్ డేను పురస్కరించుకుని చార్మినార్ వద్ద నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాలు చారిత్రక ఆనవాలని తెలిపారు. వాటిని భవితరాలకు అందించాల్సిన భాద్యత మనపై ఉందని చెప్పారు. నగరంలో అనేక చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం సామూహికంగా ఉద్యమించాలన్నారు. నేడు అనేక ప్రాంతాల్లో వారసత్వ కట్టడాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని విచారం వ్యక్తంచేశారు.
చార్మినార్ ప్రాంతంలోనూ పురాతన కట్టడాలకు ముప్పు వాటిల్లేలా నిర్మాణాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాల చుట్టూ 100 మీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టవద్దనే నిబధనలు ఉన్నప్పటికీ, యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్, చార్ కమాన్, సర్ధార్ మహల్ కట్టడాల చుట్టూ అక్రమ నిర్మాణాల అడ్డుకోవాలని చెప్పారు. ప్రపంచ వారసత్వ హోదాకు చార్మినార్‌కు అన్ని అర్హతలున్నా చుట్టూ ఉన్న నిర్మాణాల వల్ల అది సాకారమవడం లేదని వెల్లడించారు. చార్మినార్ వద్ద మొదలైనా హెరిటేజ్ వాక్ చౌమహల్ పాలేస్ వరకు