కార్వాన్: గుడిమల్కాపూర్‌లో కింగ్ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రంజాన్ ఎక్స్పో పేరుతో పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఫర్ఖాన్ అహ్మద్, సయ్యద్ హారున్ బొమ్మల దుకాణం ఏర్పాటు చేయగా, వీరి పక్కనే తౌఫిక్ పెర్ఫ్యూమ్ దుకాణాన్ని పెట్టాడు. శుక్రవారం ఫర్ఖాన్ ఓ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను ఉచితంగా ఇవ్వాలని తౌఫిక్‌ను కోరగా, అతడు నిరాకరించాడు.
ఫర్ఖాన్ తన అనుచరులతో కలిసి గొడవకు దిగాడు. ఎక్స్పో ముఖ్యనిర్వాహకుడైన ఆసివుద్దీన్ ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తనపై దాడి చేస్తారేమోనని ఆందోళన చెందిన ఆసివుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తీసి..గాలిలోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. పోలీసులు అసివుద్దీన్ను అదుపులోకి తీసుకొని, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.