మాదాపూర్, జూలై 15: వైశాలినగర్ రైల్వే అండర్ పాస్(ఆర్యూబీ) పరిధిలో ప్రతిపాదిత రోడ్డు వెడల్పు, వర్షపు నీటి కాలువ (స్మార్ట్ వాటర్ డ్రైన్) పనుల దృష్ట్యా ఈనెల 16వ తేదీ నుంచి 20 రోజలపాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్యూబీ మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ నుంచి వైశాలి నగర్ అండర్పాస్ మీదుగా హఫీజ్పేట్ వైపు వెళ్లే వాహనదారులను మై హోమ్ మంగళ టీ జంక్షన్ వద్ద మళ్లించనున్నట్లు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు.