హైదరాబాద్: వరుస బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను (Raja Singh) పోలీసులు అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా బయ తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లవద్దని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకు, భద్రతకు ముప్పు పొంచిఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ కారులోని తిరగాలని, 1+4 సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. బైక్‌పై తిరగొద్దని సూచించారు. భద్రత విషయంలో పూర్తిస్థాయిలో సహకరించాలని సిటీ పోలీసులు కోరారు. ఈ మేరకు మంగల్హాట్ పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు.
కాగా, రాజాసింగ్‌కు గత నెల 25న బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనన బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. గతంలోనూ ఆయనకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను గర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.