బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 08:58:31

ఇబ్బందులకు గురైన ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగేలా

ఇబ్బందులకు గురైన ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగేలా

ఉప్పల్‌ జోన్‌ బృందం : ఉప్పల్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వరద బాధితులకు అధికారులు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తిరిగి బాధితులకు సహాయం అందజేస్తున్నారు. ఆర్థిక సహాయం రూ.10 వేలతో పాటు నిత్యావసర వస్తువులను కూడా బాధితులకు పంపిణీ చేస్తున్నారు. 

వరదలతో ఇబ్బందులకు గురైన ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగేలా చూస్తామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్‌ నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించామన్నారు. ఈ మేరకు ప్రతి కుటుంబానికి తోడ్పాటు అందించే విధంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేసీఆర్‌ రిలీఫ్‌ కిట్స్‌, దుప్పట్లు అందజేశామన్నారు. అదేవిధంగా తక్షణ ఆర్థిక సహాయంలో భాగంగా ప్రతి బాధితుడికి రూ. పదివేలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికి తక్షణ సహాయంగా నగదు అందించడం జరుగుతుందన్నారు. వరద ముంపు ప్రాంతాలను మంత్రి కేటీఆర్‌ స్వయంగా పరిశీలించారని తెలిపారు. వరద ముంపునకు గురైన బాధితులను కలిసి భరోసా కల్పించి, వారికి సహాయం అందజేశారని చెప్పారు. అదేస్ఫూర్తితో ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా ఇంటింటికీ వెళ్లి రూ.పదివేలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వరద  ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి సహాయం అందేలా చూస్తామన్నారు. సహాయక చర్యలు చేపడుతూ, నగదు పంపిణీ చేస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. నగదు పంపిణీని వేగవంతంగా పూర్తిచేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేకల మధుసూదన్‌రెడ్డి, ఎలుగేటి మోహన్‌రెడ్డి, జి.కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

చిలుకానగర్‌లో..

వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సహాయ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లోని వరద బాధితులకు రూ.పదివేల నగదు పంపిణీ చేస్తున్నారు. చిలుకానగర్‌ డివిజన్‌లోని బీరప్పగడ్డలో వరద బాధిత కుటుంబానికి కార్పొరేటర్‌ గోపు సరస్వతీ సదానంద్‌ మంగళవారం రూ.పదివేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయం బాధిత కుటుంబాలకు అందేలా చూస్తామన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేవిధంగా చూస్తామన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, నేతలు గోపు సదానంద్‌ పాల్గొన్నారు. 

రామంతాపూర్‌లో..

వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నగదు, సీఎం రిలీఫ్‌ కిట్లు అందరికీ అందిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం రామంతాపూర్‌లో పలువురు ముంపు బాధితులకు రూ. 10 వేల నగదు సహాయాన్ని అందజేశారు.  కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాగ రవీందర్‌, డివిజన్‌ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్‌, తవిడబోయిన గిరిబాబు, గడ్డం రవికుమార్‌, సంధ్య, సోమ నారాయణ, రహమాన్‌, శాగ శ్రీనివాస్‌, ఏఈ విఘ్నేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.

పాత రామంతాపూర్‌, నెహ్రూనగర్‌లో మున్సిపల్‌ అధికారులు, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాగ రవీందర్‌, రామంతాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్‌, పలువురికి రూ. 10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం ముంపు బాధితులకు అందేలా చూస్తామన్నారు. 

కాప్రా సర్కిల్‌ పరిధిలో..

 కాప్రా సర్కిల్‌ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం డివిజన్లలోని వరద ముంపు ప్రాంతాల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమం మంగళవారం కొనసాగింది. కాప్రా డివిజన్‌లోని నిర్మలానగర్‌, శ్రీశ్రీనగర్‌కాలనీ, మహ్మదీయకాలనీ, ఓల్డ్‌కాప్రా ప్రాంతాల్లో డివిజన్‌ కార్పొరేటర్‌ స్వర్ణరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంకే బద్రుద్దీన్‌, కొప్పులకుమార్‌, సర్కిల్‌ డీఈఈ భవానీ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ మాట్లాడుతూ.. ముంపు వల్ల నష్టపోయిన బాధితులకు రూ. పదివేలు పరిహారంగా అందజేస్తున్నామన్నారు. ఎండీ గౌస్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

ఏఎస్‌రావునగర్‌లో....

ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మిగడ్డ, మారుతీనగర్‌, శ్రీనగర్‌కాలనీలో వరద బాధితులకు రూ. పదివేల నగదును కార్పొరేటర్‌ పావనీరెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో వరద నీరు నిలువకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మణిపాల్‌రెడ్డి, బేతాల బాల్‌రాజు, సురేందర్‌రావు, నాగేశ్వర్‌రెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌బీకాలనీలో....

మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య డివిజన్‌ పరిధిలోని చైతన్యనగర్‌, మంగపురంకాలనీ, వడ్డెరబస్తీ, నవోదయనగర్‌ కాలనీల్లో పర్యటించి దాదాపు 250 మంది వరద ముంపు బాధితులకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జి. శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ తిరుమలయ్యగౌడ్‌, ప్రత్యూష, చారి, గంగాధర్‌, కాలనీవాసులు పాల్గ్గొన్నారు.