చర్లపల్లి, డిసెంబర్ 7: నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధిలో టీఆర్ఎస్ శ్రేణులు చురుకుగా పాల్గొన్నాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు మం గళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిశారు.అనంతరం నూతన కమిటీ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, గీత ప్రవీణ్, చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, అనిల్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, బాబు, నర్సింహగౌడ్, ఎస్కే. కరీం, నర్సింగ్‌రావు, వినోద్, రెడ్డినాయక్, నందకిషోర్, మనోహర్, సత్యనారాయణ, చంద్రమౌళి, వేణుగోపాల్‌రెడ్డి, పరుశురాంగౌడ్, ఉపేందర్, నర్సింహ, మహిళా విభాగం అధ్యక్షురాలు నవనీత తదితరులు పాల్గొన్నారు.