చాదర్‌ఘాట్, నవంబర్ 17 : పాతనగరంలో బీఆర్ఎస్ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది. మలక్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి శుక్రవారం ఆజంపుర డివిజన్లోని కట్టెలమండీ, ఉప్పర్‌బస్తీలో ప్రచారం నిర్వహించారు. స్థానికులకు సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలను వివరించారు. సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ విజయంనకు తోడ్పడుతాయని, ప్రజలందకూ కేసీఆర్ జనరంజక పాలనను స్వాగతిస్తున్నారన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో దానకర్ణాచారి, డివిజన్ అధ్యక్షుడు కారింగల మారుతి, మారేపల్లి బాబురావు, అమర్నాథ్, డాక్టర్ సుమన్, పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయంలో సమావేశం..
ఆజంపురలోని బీఆర్ఎస్ పాతనగరం కార్యాలయంలో యాకుత్‌పుర, చాంద్రాయణ గుట్ట, మలక్‌పేట నియోజకవర్గాల అభ్యర్థులు సామ సుందర్‌రెడ్డి, రాంరెడ్డి, తీగల అజిత్‌రెడ్డి మలక్‌పేట నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రోజువారీ ఎన్నికల ప్రచారంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఆజం అలీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అఖండ మెజార్టీతో గెలిపించాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లాయక్ అలీ పాల్గొన్నారు.
అధికారం మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే
సైదాబాద్, నవంబర్ 17 : బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి రావటం ఖాయమని ఐఎస్ సదన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మెట్టు భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాకుత్‌పుర నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి సామ సుందర్‌రెడ్డికి మద్దతుగా ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, కృష్ణానగర్ కాలనీ, కృష్ణానగర్ కాలనీ ఫేస్-1, శ్రీనివాస కాలనీ, ఆదర్శనగర్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులే బీఆర్ఎస్ని గెలిపిస్తాయని, సంక్షేమాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచనలు చేసి ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డికి ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.