ఎల్బీనగర్ ; తెలంగాణ పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. 5వేల పోస్టులకు కాకుండా 20 వేల పోస్టులకు మెగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు.
ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయం వద్దకు చేరుకుని నిరుద్యోగులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.
నిరుద్యోగులు తాము ఆందోళనను వదలమంటూ.. భీష్మించుకుని కూర్చోవడంతో వారిపై బలప్రయోగం చేసి అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసి.. వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.