Property Tax | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్‌పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఆస్తి పన్ను రూ.1200లోపు ఉన్న భవనాలకు ఏటా రూ.101లు పన్ను చెల్లిస్తే సరిపోతుందని ప్రత్యేక రాయితీ పథకాన్ని తీసుకువస్తూ జీవో జారీ చేశారు. ఈ పథకం కింద లబ్ధిపొందుతూ వచ్చిన ప్రసాద్ రావుకు ఒక్కసారిగా ఏటా రూ.10,608ల చొప్పున ట్యాక్స్ వేసి నాలుగేళ్ల ట్యాక్స్ ఒకేసారి రూ. 43,267లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఇదేక్కటి అన్యాయమని డిప్యూటీ కమిషనర్లను, టీఐ (ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల)ను అడిగిన ఫలితం లేదు. సదరు ప్రసాదరావు సమగ్ర వివరాలతో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.. ఇప్పటికి ప్రసాద రావు సమస్య పరిష్కారానికి నోచుకోలేదు..ఒక్క ప్రసాద్ రావుకే కాదు.. చాలా మంది రూ.101 రాయితీ లబ్ధిదారులు ప్రతి శనివారం జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ప్రాపర్టీ పరిష్కార వేదికలకు క్యూ కడుతున్నారు.
సైదాబాద్ కుర్మగూడలోని ఏళ్ల నాటి ఇల్లు అది.. ఇంటి నంబరు 17-2-427, 428, పీటీఎన్ నంబరు 1041705840 కలిగిన ఆ రెండంతస్తుల ఇంటికి గతంలో ఆస్తిపన్ను రూ.3వేలుగా ఉండేది.. యాజమానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆస్తిపన్నును సవరించింది. అప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన సదరు యాజమానికి నాలుగు రేట్ల బిల్లు రావడంతో ఖంగుతిన్నాడు.
శివారు మున్సిపాలిటీల్లో..
జీహెచ్ఎంసీని అనుకుని ఉన్న శివారు మున్సిపాలిటీలలో ఇంటిపన్ను బాధితులు పెరిగిపోతున్నారు. మీర్‌పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ తదితర మున్సిపాలిటీలలో ఇంటి పన్నుపై ఫిర్యాదుదారులు ఏకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మీర్‌పేట మున్పిపాలిటీలలో పలువురి కాలనీలు కలిసి ఏకంగా ‘ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్’ ఏర్పాటు చేసి ఇంటిపన్ను తగ్గింపునకు పోరు బాట పట్టారు. ఏకంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పన్నుల భారం తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. నిర్మాణ ప్రాంతంతో పాటు నిర్మించిన ఇంటి స్థలం విలువపై కూడా అదనంగా పన్ను వేస్తుండటమే ఈ నిరసనకు ప్రధాన కారణం.
నిర్మించిన ఇంటితో పాటు నిర్మాణమైన స్థలానికి సంబంధించిన రెండు పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఇక్కడి కాలనీ వాసులు వాపోతున్నారు. ఉదాహరణకు 100 గజాలలో జీ 2తో సుమారు 2500 ఎస్ఎఫ్టీలో ఇంటి నిర్మాణం జరిగితే, 2500 ఎస్ఎఫ్టీకి పన్ను విధిస్తుంటారు, నివాసాలకు సుమారు .25 పైసలు, కమర్షియల్ .35పైసల మేర పన్నులు విధిస్తున్నారు. ఇంత వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న పన్ను వసూలు విధానం. అయితే ఇళ్లు నిర్మించిన వంద గజాల స్థలానికి గవర్నమెంట్ వాల్యూ రూ.12500 అనుకుంటే దానిపై కూడా .25పైసల మేర పన్ను చెల్లించాల్సి వస్తోందంటూ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖజానా నింపుకోవడమే లక్ష్యం..
జీహెచ్ఎంసీ, శివారు అని తేడా లేకుండా సామాన్యుల నుంచి ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేసి ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు. పేదలపై ‘పన్ను’పోటు వేస్తూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జీహెచ్ఎంసీలో అప్రకటిత భారం మోపుతుండగా, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమను బతకనిచ్చే పరిస్థితి లేదంటూ శివారు మున్సిపాలిటీలలోని కాలనీలు, బస్తీల ప్రజలు ఏకమవుతూ ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. మ రికొందరు న్యాయపోరాటాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ చీకటి పన్నుకు తెరలేపిన మీర్‌పేట మున్సిపల్ అధికారుల తీరును ఎండగట్టేందుకు వందలాది కాలనీలకు చెందిన ప్రజలు ఒక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా భాగస్వామ్యం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. మీర్పేట్ కార్పొరేషన్ అధికారులు మాత్రం తాము ఒక్కరమే ఇలా చేయడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీలలో ఇలాంటి పన్ను వసూలు జరుగుతుందని తెలంగాణ రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ, తమళనాడు, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ పలు రాష్ర్టాల్లో ఆన్లైన్ బెట్టింగ్‌ను నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చారు. తెలంగాణలో ఈ యాప్‌లో ఇంటర్నెట్లో ఓపెన్ కాకూడదు. ఆయా రాష్ర్టాల సరిహద్దులను ప్రామాణికంగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ ఓపెన్ కాకూడదు. ఓపెన్ అయ్యాయంటే పోలీసులు చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ నకిలీ జీపీఎస్‌లను ఉపయోగిస్తూ ఆయా వెబ్సైట్లు, యాప్‌లు నిషేధమున్న రాష్ర్టాలలోను ఓపెన్ అయ్యే విధంగా చేస్తున్నారు. దీంతో ఆయా బెట్టింగ్ రాయుళ్లు నిషేధమున్న రాష్ర్టాలలోను కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇందులో చాలా గేమ్స్‌కు చెందిన వెబ్సైట్లు, యాప్‌లు మన దేశ సరిహద్దు అవతలి నుంచే నిర్వహిస్తున్నారు.
బంపర్ ఆఫర్ అంటూ ..
ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలు ఇవ్వడం, ఇన్ప్లూయెన్సర్స్తో ఆయా గేమ్స్ గూర్చి చెప్పించడం చేస్తున్నారు. ఇలా ఆయా వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫర్ ఇస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్ధితిలో చాలా మంది ఉంటున్నారు. పది సార్లు పెట్టుబడి బడితే ఎనిమిది సార్లు నష్టపోవడం, రెండు సార్లు లాభం వచ్చినట్లు చూపించే లాజిక్స్‌ను బ్యాకెండ్ నుంచి గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులు చేస్తుంటారు.
బీఆర్ఎస్ హయాంలో ముఠాల ఆటకట్టు
గత బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆటలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీయులు బ్యాకెండ్‌లో ఉండి కలర్ ప్రిడిక్షన్ పేరుతో ఒక ఆన్లైన్ గేమ్‌ను తయారు చేసి దేశ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలను లాగేశారు. ఈ గేమ్‌లో నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా స్పందించి ఆయా ముఠాల ఆటకట్టించింది.
కోట్లాది రూపాయల లావాదేవీలు..!
సోషల్‌మీడియాలో ఇన్ప్లూయెన్సర్స్ ప్రభావం నేడు సామాన్య ప్రజలపై చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారాభివృ ద్ధికి ఇన్ప్లూయెన్సర్తో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలు ఇస్తే తక్కువ మొత్తంలోనే ఆదాయం ఉంటుంది. అదే నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను మార్కెటింగ్ చేస్తే భారీగా ఆదాయం ఉంటుంది. పలువురు ఇన్ప్లూయెన్సర్స్ ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన లింక్‌లు తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తమ ఫాలోవర్స్‌కు చేరే విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు. లక్షల్లో వ్యూవర్స్ ఉంటున్నారు. అందులో 10 శాతం మంది అయినా ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో బెట్టింగ్ యాప్‌లకు భారీగానే ఆదాయం వస్తుంది. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ ఇస్తూ కొంత మంది సోషల్‌మీడియా ఇన్ప్లూయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇన్ప్లూయెన్సర్స్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని, ముంబై ఢిల్లీ ప్రాంతాల నుంచి ఇన్ప్లూయెన్సర్స్ ఖాతాలలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులకు ప్రాథమికంగా తెలిసినా పట్టనట్లుగా ఇన్నాళ్లు వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఒక ఐపీఎస్ అధికారి దీనిపై స్పందించడంతో పోలీసులు కండ్లు తెరిచారనే టాక్ విన్పిస్తోంది.