Kothagudem : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు పలువురు మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సమీపంలోని ఉదయ నేచర్ క్యూర్ సెంటర్ (Udaya Natural Cure Centre) నిర్వాహకులు, నేచురోపతి ప్రాక్టీషనర్, హీలర్. జి. సుగుణారావు (Suguna Rao)కు మంగళవారం పర్యావరణ ప్రేమికురాలు నైనికా రజ్వా (Nainika Razva) మొక్కను అందించి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు హరిత దీక్ష వ్యవస్థాపకులు, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, తెలుగు వెలుగు ఛానెల్ అధినేత పూర్ణ చందర్ రావు, ప్రకృతి ఆశ్రమం సభ్యులు దయానంద సాగర్, శోభారాణిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నైనికా విషయానికొస్తే.. చిన్నవయసులోనే ప్రకృతి పరిరక్షణలో పాలుపంచుకుంటోందీ చిన్నారి. శుభాశుభ కార్యక్రమాలకు, ప్రత్యేకత కలిగిన రోజులను పురస్కరించుకొని పలువురికి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలుపుతోంది. ఆయా రంగాల్లో వాళ్ల కృషిని అభినందనందిస్తూనే.. పచ్చదనం పెంచే ప్రయత్నం చేస్తుంది నైనికా. అందుకే.. ఆమెను, ఆమెకు తోడ్పాటు అందిస్తున్న తండ్రి దశరథ్ రాజ్వాలను సుగుణా రావు, పూర్ణచంద్రరావు, రాజశేఖర్లు అభినందించారు.