సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : అమెరికన్ ఎంబసీ న్యూఢిల్లీ సీనియర్ రీజియనల్ సెక్యూరిటీ అఫీసర్ యోన్ గువైలామే సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. సీపీ అంజనీకుమార్ ఆయనకు స్వాగతం పలికారు.
హైదరాబాద్లో పటిష్టమైన శాంతి భత్రతలు ఉన్నాయని, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని సీపీ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కొవిడ్- 19 పుస్తకాన్ని ఆయనకు అందించారు.