హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడలో విషాదం చోటుచేసుకున్నది. హోర్డింగ్ దింపే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఓ చిట్‌ఫండ్ కంపెనీకి చెందిన హోర్డింగ్‌కు దించేందుకు బాలు (37) అనే వ్యక్తి కూలికి వచ్చాడు. సహాయం కోసం రామంతాపూర్‌కు చెందిన మల్లేశ్ (29) అనే యువకుడిని పిలిచాడు.
ఇద్దరూ కలిసి భవనం రెండో అంతస్తులోని హోర్డింగ్‌ను దించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. దీంతో వారిద్దరికి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.