మారేడ్పల్లి, ఏప్రిల్ 15: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మానసిక స్థితి సక్రమంగా లేక అనారోగ్యానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నారు. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం…కార్ఖానాలోని మనో వికాస్ నగర్ శ్రీనిధి అపార్ట్మెంట్ బీ బ్లాక్ నాలుగో అంతస్థులో అవివాహితులైన మీనా చంద్రన్ (59), వీణా చంద్రన్ (60) లు అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు.
అనారోగ్య సమస్యలతో పాటు మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఈ నెల 11న లోపల గడియ వేసుకొని గుర్తు తెలియని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో అపార్టుమెంట్ వాసులు పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మారేడ్పల్లి లో ఉంటున్న మరో సోదరి సాధనను రప్పించి త లుపులు తెరిచారు.
మృతి చెందిన ఇరువురు మృత దేహాలను పోస్టుమార్లం నిమిత్తం గాం ధీ మార్చురీకి తరలించారు. వారి తండ్రి చంద్రన్ రిటైర్డు ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో .. గత కొన్నేండ్లుగా అతని పింఛన్ డబ్బులతో జీవనం గడుపుతున్నట్లు సోదరి పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.