Hyderabad | బంజారాహిల్స్, అక్టోబర్ 19: ఎక్కువ మద్యం తాగించేందుకు యువతులను ఎరగా వేస్తుండడంతోపాటు అశ్లీల నృత్యాలు చేయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్మీద టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. 100మంది యువకులతో పాటు 42మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బింగి బలరామ్ గౌడ్, జగద్గిరిగుట్టకు చెందిన బింగి శ్రీనివాస్ గౌడ్లు బంజారాహిల్స్ రోడ్ నం.3లో టేల్స్ ఓవర్ స్పిరిట్స్( టాస్) పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.
ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడం కోసం ఇటీవల అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. వీకెండ్స్‌లో అందమైన యు వతులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వడంతోపాటు కస్టమర్లకు ఎక్కువగా మద్యం తాగించేందుకు వారికి డబ్బులు ఇస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో యువతులు వచ్చి కస్టమర్లపక్కన కూర్చోవడం, వారిచేత మద్యం తాగించడం, వారితో కలిసి అశ్లీల నృత్యాలు చేయడం చేస్తున్నారు.
వీకెండ్స్‌లో ఒక్కో యువతికి రూ.2వేల నుంచి రూ.4వేల దాకా బార్ నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 12.15గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ బార్మీద దాడులు నిర్వహించారు. భారీ మ్యూజిక్‌తో డీజే పెట్టడంతో పాటు యువతీయువకులు అశ్లీల నృత్యాలతో కనిపించారు. దీంతో అక్కడున్న 100మంది యువకులను, 42మంది యువతులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పట్టుబడినవారిపై కేసు నమోదు చేశారు. కాగా పట్టుబడిన యువతుల్లో 32మంది తొలిసారిగా వచ్చిన వారు కాగా మరో 10మంది గతంలో కూడా కొన్ని పబ్స్‌లో ఇలాంటి అశ్లీల నృ త్యాలు చేసినట్లు తేలింది. బార్ నిర్వాహకులు బల్రామ్గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పరారీలో ఉం డగా మేనేజర్ అలీమ్, బార్ అటెండర్ రామకృష్ణ, డీజే ఆపరేటర్ ఆసిఫ్, బౌన్సర్లు అరీఫ్, అబ్దుల్ సమీ, సయ్యద్షాహిద్, సొహైల్ యూసఫ్ ఖాసింఖాన్, తదితరులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.