హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్‌లపై వెంబడిస్తూ భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకులు రోడ్డుపై బైక్‌లను కారుకు అడ్డంగా తిప్పుతూ కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు భువనగిరి మండలం హన్మాపురానికి చెందిన రంగ శివ(21), అఖిల్(20)లుగా పోలీసుల గుర్తించి అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.