హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి మంచిరేవులకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ రూట్లో కొత్తగా ఎనిమిది సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. రాణిగంజ్ డిపోకు చెందిన ఎనిమిది సిటీ బస్సులను సికింద్రాబాద్ నుంచి మంచిరేవుల మార్గంలో నడిపిస్తున్నారు. 47Y నంబర్‌తో ఈ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ నుంచి ప్యారడైజ్, అమీర్‌పేట్, యూసూఫ్‌గూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మణికొండ, నార్సింగి మీదుగా ఈ బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు రాపోకలు కొనసాగించనున్నాయి. అయితే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం.. ఈ మార్గంలో కొత్తగా బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు.