తెలుగు యూనివర్సిటీ, జనవరి 28 : ఆర్టీసీలో అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ జాబ్‌లలో బ్లైండ్స్కు అవకాశం కలిపిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హామీనిచ్చారు. నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన క్యాలెండర్‌ను సజ్జనార్ ఆవిష్కరించి మాట్లాడారు.
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కారణంగా దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చుంటున్నారని, దీంతో వారు ఇబ్బందులకు గరవుతున్నారన్నారు. త్వరలోనే 2375 కొత్త బస్సులు తీసుకుంటున్నామని తెలిపారు. బ్లైండ్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి మంచి రైటర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఎం.వీరయ్య, హైకోర్టు న్యాయవాది వినీత ఠాకూర్, సంఘం ప్రధాన కార్యదర్శి బి.రాఘవేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్‌కుమార్, సంయుక్త కార్యదర్శి రవీందర్, కోశాధికారి జి.మల్లేశ్ పాల్గొన్నారు.