
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభు త్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్పాసులు జారీ చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఇప్పటికే సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అనంతరం విద్యాసంస్థల యాజమాన్యాల ధ్రువీకరణ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల ద్వారా సెప్టెంబర్ 2 (గురువారం) నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.15 వరకు పాసులను జారీ చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్పాసు కేంద్రాలు, ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాల కోసం https://online.tsrtcpass.in వెబ్సైట్లో సంప్రదించవచ్చని అన్నారు.