
మారేడ్‌పల్లి, ఆగస్టు 19: టీఎస్ ఆర్టీసీ ఎయిర్ పోర్టుకు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు తన లగేజీ బ్యాగ్‌ను మరచిపోయింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకొని తిరిగి ఆ బ్యాగ్‌ను డివిజన్ మేనేజర్ జగన్, కంటోన్మెంట్ డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తిలు ఆ ప్రయాణికురాలుకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్లితే, లక్నో ప్రాంతానికి చెందిన సోన్మ్ కనౌజియా అనే ప్రయాణికురాలు ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులో తన లగేజీ బ్యాగ్‌ను మరచిపోయింది. అనంతరం, డ్రైవర్ వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వెంటనే డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి ఆ బ్యాగ్‌ను పరిశీలించి, ఆ ప్రయాణికురాలుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆ ప్రయాణికురాలు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకోవడంతో డీవీఎం జగన్, డిపో మేనేజర్. కె.కృష్ణమూర్తిలు బ్యాగ్‌ను అప్పగించారు. ఆ బ్యాగ్‌లో విలువైన వస్తువులతో పాటు, ఏటీఎం, డెబిట్ కార్డులు, మూడు వేల నగదు, వివిధ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రయాణికురాలు ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.