హైదరాబాద్ : బాగ్ అంబర్‌పేటలోని నారాయణ జూనియర్ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇవాళ ఉదయం జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాలేజీ ప్రాంగణంలో అనవసర ఘటన ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వం నోటీసులో పేర్కొంది.
ఇవాళ ఉదయం టీసీ కోసం సాయి నారాయణ అనే విద్యార్థి నారాయణ జూనియర్ కాలేజీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సదరు విద్యార్థి పెట్రోల్ పోసుకొని, ప్రిన్సిపాల్‌ను భయపెట్టించాడు. కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ దీపం వెలిగించి ఉంది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్‌కు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.