టీఆర్ఎస్కు ఎదురు లేదు
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన పాండు వివేకానందగౌడ్ తెలిపారు. తంగడపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఐదవ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్

చౌటుప్పల్, అక్టోబర్ 11: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన పాండు వివేకానందగౌడ్ తెలిపారు. తంగడపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఐదవ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్లోరైడ్ నిర్మూలనకు చేసింది శూన్యమన్నారు. తన ఎనిమిదేళ్ల పాలనలో మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాల హయంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతో దేశంలోనే రాష్ట్రం అభివృద్ధిలో నంబర్‌వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముట్టుకులోజు దయాకరాచారి కోయిల శేఖర్‌గౌడ్, బొంగు స్వామిగౌడ్, నిమ్మల అచ్చయ్య, అస్లం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

