హెవీ లోడ్ పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. విద్యుత్ వాడకం పెరిగిపోతుండడంతో ట్రాన్స్ఫార్మర్లపై అధికలోడ్ పడి కాలిపోతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది.
- ఓవర్‌లోడ్‌తో తట్టుకోలేకపోతున్న వైనం
- 23 రోజులు.. 860 డీటీఆర్లు..!
- నగరంలో అత్యధికంగా సైబర్సిటీలో ప్రభావం
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. విద్యుత్ వాడకం పెరిగిపోతుండడంతో ట్రాన్స్ఫార్మర్లపై అధికలోడ్ పడి కాలిపోతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది. విద్యుత్ వాడకం అధికమైతే ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ హీటెక్కి.. పెద్ద శబ్ధంతో పేలిపోతున్నాయి.
ఓవర్లోడింగ్, అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం, తగినంత శీతలీకరణ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కుతున్నాయని విద్యుత్ నిపుణులు చెప్పారు. ఎక్కువ మొత్తంలో లైఫ్‌టైమ్ పూర్తయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని , సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయని సిబ్బంది చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఓవర్‌లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కి కాలిపోతున్నాయంటూ వారు పేర్కొన్నారు. అయితే రోజురోజుకూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ సరఫరా గంటలకొద్దీ నిలిచిపోవడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
రోజుకు సగటున 50
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 6లక్షల 35వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా డీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఆయిల్ లీకేజిలను అరికట్టకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్ టెస్టర్‌తో లోడును పరిశీలించకపోవడం, వినియోగం అనూహ్యంగా పెరిగిపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి. గత ఐదురోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పేలిన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈనెల 18న 54, 19న 62, 20న 72, 21న 72, 22న 52, 23న 60 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. కేవలం 23 రోజుల్లో 860 డీటీఆర్లు(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు)కాలిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు.
అయితే ఈ పరిస్థితి నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా ఉందని, ఎక్కువగా సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సర్కిళ్లలో ఉన్నట్లు విద్యుత్ అధికారులు గణాంకాలను బట్టి గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో వస్తున్న సమస్యను అధిగమించడానికి లోడ్ రిలీఫ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. రోజుకు సగటున 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడంతో కేవలం నగరంలోనే ఇంత మొత్తంలో సమస్య ఉంటే దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనావేశారు. శుక్రవారం మాదాపూర్ సబ్‌స్టేషన్, స్విచ్స్టేషన్లను సీఎండీ జితేశ్ తనిఖీలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

