జలమండలిలో బదిలీలు షురూ
జలమండలిలో సమూల ప్రక్షాళనపై ఎండీ సుదర్శన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీ) మొదలుకొని డైరెక్టర్ల వరకు బదిలీలు జరిపేందుకు కసరత్తు ప్రారంభించారు.
- వారం రోజుల వ్యవధిలో ట్రాన్స్ఫర్
- ప్రక్రియను పూర్తి చేసే దిశగా కసరత్తు
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : జలమండలిలో సమూల ప్రక్షాళనపై ఎండీ సుదర్శన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీ) మొదలుకొని డైరెక్టర్ల వరకు బదిలీలు జరిపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఐదేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతున్న వారికి తొలుత స్థానం చలనం ఉంటుంది. ప్రధానంగా అవినీతి ఆరోపణలు, వివాదాస్పద అధికారులు, ఐదేళ్లు పైబడి ఒకే స్థానంలో ఉన్న వారిని కచ్చితంగా ఇతర చోట్లకు మార్చనున్నారు. కొన్ని డివిజన్లలో ప్రజాప్రతినిధుల అండతో ఇంజినీర్లు (డీజీఎం, జీఎం) స్థాయిలో ఏండ్ల తరబడి కొనసాగుతున్నారు. అయితే అటు బదిలీల జాబితా సిద్ధమవుతుందో లేదో అప్పుడే కొందరు పైరవీలకు తెర లేపినట్లు చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న డివిజన్లో ఉన్న జీఎం, డీజీఎంలు పైరవీలతో యథావిధిగా కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెయింటెనెన్స్ విభాగంలో ఉండే కొందరు ఇంజినీర్లు ప్రాజెక్టు విభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా? లేదంటే పైరవీల జాతర నడుస్తుందో వేచి చూడాల్సిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

