రద్దీ వేళల్లో 2 నిమిషాల్లోకో మెట్రో
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి 2 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైలులో 4 లక్షల మందికి పైగా ప్రతి రోజు ప్రయాణించగా, ప్రస్తుతం ప్రతి రోజు 4.5లక్షల మందికి పైగానే ప్రయాణం చేస్తున్నారు.
- తక్కువ ఫ్రీక్వెన్సీలో మెట్రో రైళ్ల రాకపోకలు
- రద్దీకి అనుగుణంగా కొత్తగా కోచ్‌లను పెంచుతాం
- మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి 2 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైలులో 4 లక్షల మందికి పైగా ప్రతి రోజు ప్రయాణించగా, ప్రస్తుతం ప్రతి రోజు 4.5లక్షల మందికి పైగానే ప్రయాణం చేస్తున్నారు. మెట్రో ప్రయాణికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుతం రద్దీ వేళల్లో 3 నిమిషాలకో మెట్రో రైలు నడుస్తుండగా, దాన్ని 2 నిమిషాలకో రైలును నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు మెట్రో కారిడార్లలో ఎక్కువగా ఐటీ కారిడార్ వెళ్లే నాగోల్-రాయదుర్గంతో పాటు ఎల్బీనగర్-మియాపూర్ మార్గం రద్దీ అధికంగా ఉంటుందని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులకు సూచించారు.
ముఖ్యంగా అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ పరిధిలో షార్ట్ లూప్ సర్వీసులను నడపాలని సూచించారు. షార్ట్ లూప్ విధానంలో ప్రతి 3 నిమిషాలకు ఒక రైలును నడుపుతుండగా, దాన్ని మరింత తగ్గించి ప్రతి 2 నిమిషాలకో రైలును నడపడంతో రద్దీని నియత్రించవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు 3 కోచ్‌ల స్థానంలో అదనంగా కోచ్‌లను పెంచే అవకాశం లేకపోవడంతో ఫ్రీక్వెన్సీని తగ్గించి ఖచ్చితమైన సమయ పాలనతో రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

