సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట తెలుగు సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుండడంతో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు యూసుఫ్‌గూడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ నేపధ్యంలో యూసుఫ్‌గూడ నుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫంక్షన్‌కు వచ్చేవారందరూ నిర్వాహకులు జారీ చేసిన హాలోగ్రామ్‌తో కూడిన పాస్‌లను తమ వెంట తప్పని సరిగా తెచ్చుకోవాలని, పాస్‌లు లేని వారికి లోపలికి అనుమతి లేదన్నారు. వాహనదారులు ఆంక్షల నేపధ్యంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
మైత్రీవనం నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్లో వచ్చే వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణకాంత్ పార్కు, కళ్యాణ్‌నగర్, వైపు మళ్లిస్తారు.
జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి వచ్చే వాహనాలను యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు అనుమతించరు. ఈ రూట్లో వచ్చే వాహనాలను శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. పార్కింగ్ స్థలాలు
మహమూద్ ఫంక్షన్ హాల్లో70 కార్లకు పార్కింగ్ అవకాశం.
జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా 200 కార్లు, 700 బైక్‌లకు పార్కింగ్ అవకాశం.
యూసుఫ్‌గూడ ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే 200 ద్విచక్ర వాహనాలకు అవకాశం.
యూసుఫ్‌గూడ, మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో 500 ద్విచక్రవాహనాలకు అవకాశం కలదు.