తెల్లాపూర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
భారీ వర్షాల సమయంలో నీటి ముంపు సమస్య తలెత్తుతున్న తెల్లాపూర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ , ఆర్సీసీ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై నేటి నుంచి 25 రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
- నేటి నుంచి 25 రోజుల పాటు అమలు
సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల సమయంలో నీటి ముంపు సమస్య తలెత్తుతున్న తెల్లాపూర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ , ఆర్సీసీ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై నేటి నుంచి 25 రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో నల్లగండ్ల-తెల్లాపూర్ రోడ్డు లో ఎస్బీఐ తెల్లాపూర్ వద్ద ఒక వైపు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు తె లిపారు. దీంతో ఎస్బీఐ తెల్లాపూర్ యూ టర్న్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ యూ టర్న్ వరకు సుమారు 300 మీటర్ల మేర వాహనాలను అందుబాటులో ఉన్న ప్ర త్యామ్నాయ మార్గాల వైపు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల మీదుగా వెళ్లడం మంచిదని పోలీసులు సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు….
- నల్లగండ్ల సరిల్ నుంచి తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ , ఓఆర్ఆర్ ఎగ్జిట్ -2 వైపు వెళ్లే వాహనాలు ఎస్బీఐ తెల్లాపూర్ వద్ద దారి మళ్లిస్తారు. నల్లగండ్ల నుంచి ఉస్మాన్ నగర్ , కొల్లూరు వైపు వెళ్లే వాహనదారులు నల్లగండ్ల సరిల్ -నియో మాల్ -గోపన్ పల్లి ఎక్స్ రోడ్ -ఏలియన్స్ జంక్షన్ -ఉస్మాన్‌నగర్ -ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్ -కొల్లూరు మార్గం మీ దుగా ప్రయాణించాలని సూచించారు. తెల్లాపూర్ సరిల్ నుంచి ఆర్సీ పురం వైపు వెళ్లే వాహనదారులు తెల్లాపూర్ స రిల్ -సాయిబాబా టెంపుల్ -రైల్వే అం డర్ బ్రిడ్జ్ -ఓల్డ్ ఎంఐజీ-ఆర్సీ పురం మార్గంలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- కొల్లూరు, ఉస్మాన్ నగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొల్లూరు-ఉస్మాన్ నగర్ -ఏలియన్స్ జంక్షన్ -మై హోమ్ సయూక్ -గోపన్ పల్లి జంక్షన్ -గౌలిదొడ్డి-విప్రో సరిల్ -ఐఐటీ జంక్షన్ -గచ్చిబౌలి మార్గాన్ని ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీ పీ-1 ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

