జాయింట్ సీపీనారాయణ్నాయక్
సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : పాఠశాల నిర్వాహకులు ట్రాఫిక్ నియమాలు పాటించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైతం ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్నాయక్ అన్నారు.
రోడ్డు భద్రత మాసాన్ని పురస్కరించుకొని బుధవారం పాఠశాల యాజమాన్యాలతో ట్రాఫిక్ నియమాలపై కమిషనరేట్లో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. పాఠశాలలో పార్కింగ్ స్థలం లేకపోతే పరిసరాల్లో అద్దెకు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.