సిటీ బ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నేటి ఉదయం 9 గంటల నుంచి సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు శోభాయాత్ర జరగనున్నట్లు పేర్కొన్నారు.
ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు వెల్లడించారు. అటు వైపు వెళ్లాల్సిన వారు గమనించాలని కోరారు. ప్రయాణికులు ట్రాఫిక్ ఏర్పాట్లను గుర్తించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని పోలీసులకు సహకరించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నెంబర్‌ను సంప్రదించాలని వెల్లడించారు.