రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్‌కు సమీపంలో ఉన్న సిగ్నల్స్ వద్ద రోడ్డుపై కంకర రాళ్లు పడిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. బైక్‌లు స్కిడ్ అవుతున్నాయి. అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. క్షణం కూడా ఆలోచించకుండా.. రోడ్డుపై పడి ఉన్న కంకర రాళ్లను ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కకు ఊడ్చేశాడు. వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం శ్రమించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ సమీపంలో వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం ఓ ట్రాఫిక్ పోలీసు కష్టాలు.. pic.twitter.com/OAsYdLrw7g
— Namasthe Telangana (@ntdailyonline) August 27, 2022