హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం నూతన డైరీని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు గంధం రాములు, నాయకులు కోల శ్రీనివాస్, దండుగుల రామ కృష్ణ , శంకర్ గౌడ్ పాల్గొన్నారు.