Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా గత పది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, పోలీసు విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
ఇక గత పది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో నమోదైన వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఆ వివరాలను చూద్దాం..
జవహర్ నగర్, ముషీరాబాద్ – 18 మి.మీ.(జులై 24)
ఎంసీఆర్హెచ్ఆర్డీ ఐటీ క్యాంపస్, షేక్‌పేట – 19.3 మి.మీ.(జులై 25)
మైలార్‌దేవ్‌పల్లి – 15 మి.మీ.(జులై 26)
సీఎంటీసీ షేక్‌పేట్ – 112.3 మి.మీ.(ఆగస్టు 4)
ఖాజగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్, గచ్చిబౌలి – 123.5 మి.మీ.(ఆగస్టు 7)