Power Cut | మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 7: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చందానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన ఫీడర్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం పలు ఫీడర్లలో తాత్కాలికంగా విద్యుత్ ను నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఏఈ దీప్తి తెలిపారు. ఇందులో భాగంగా 11 కేవీ ఆదిత్య ఇంపీరియల్ హైట్స్, 11 కేవీ మార్తాండ నగర్ ఫీడర్ పరిధిలో ఆదిత్య ఇంపీరియల్ హైట్స్, మార్తాండ నగర్ అన్ని చోట్ల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం కలగనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక అల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఏఈ రాకేశ్ గౌడ్ తెలిపారు. 11 కేవీ గాయత్రి నగర్ ఫీడర్ పరిధిలోని వివేకానంద నగర్, పర్వత్ నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, 11 కేవీ అల్లాపూర్ ఫీడర్ పరిధిలోని జ్యోతి నగర్, గాయత్రి నగర్, చంద్ర గార్డెన్ ఏరియా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం కలగనట్లు ఆయన తెలిపారు