Hyderabad | సిటీబ్యూరో, మార్చి21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో… సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది (అన్ అకౌంటబుల్ వాటర్) ఓ అంచనా. ఇందులో నీటి చౌర్యమెంత? వృథాగా పోయేది ఇంకెంత??