సుల్తాన్‌బజార్, నవంబర్ 30 : ఎయిడ్స్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఎయిడ్స్ డే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రా ష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ అన్న ప్రసన్న తెలిపారు. బుధవారం కోఠిలోని టీఎస్ఏసీఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9:30 గంటలకు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి మార్చ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మార్చ్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. సుందరయ్య పార్క్ నుంచి టీఎస్ఆర్టీసీ కల్యాణ మండపం వరకు కొనసాగుతుందని తెలిపారు. కల్యాణ మండపంలో నిర్వహించే సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వీ మాట్లాడుతారని అన్నారు. ఉత్తమ ఎన్ఏసీపీపిలకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.