Drinking Water | సిటీబ్యూరో: నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్- 2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు భారీ లీకేజీలు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మరమ్మతులు చేపడుతున్న కారణంగా 24 గంటల పాటు ఓ అండ్ ఎం డివిజన్ 15లోని ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ తదితర చోట్ల తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.