నేడు తెలంగాణ బంద్‌ను విజయవంతం చేస్తాం
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్‌కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఎల్బీనగర్, జూలై 23 : తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్‌కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఇంద్రానాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పం దించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శుక్రవారం తెలంగాణ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామని, ఈ కోవలోనే మా డిమాండ్లను వినిపించేందుకు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువతకు న్యా యం, ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయ డం వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నామన్నారు. మా ఉద్యమం, మా నిరసన శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగుతుందని, రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు మా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి.. మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆకాశ్, నవీన్, శంకర్, శిం బు, కుమార్, సోమేశ్, గణేశ్, వినయ్, రాజు యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

