వెంగళరావునగర్, మే 12: ఎర్రగడ్డలో నిర్మించిన వెయ్యి పడకల సనత్‌నగర్ టిమ్స్ దవాఖానను మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం సందర్శించారు. పెండింగ్ పనులు పూర్తవుతున్నాయని జూన్‌లో దవాఖానను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దవాఖానలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టిమ్స్‌లో ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుందని గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వెయ్యి పడకల దవాఖానలో 300 పడకలు ఎమర్జెన్సీ విభాగానికి కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలకు అన్ని చికిత్సలకు ఎక్సలెన్స్‌గా నిలుస్తుందన్నారు.