ముగ్గురు దొంగల అరెస్టు
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఎసీపీ జి.హనుమంతరావు, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ రావు, డీఐ విజయ్ నాయక్ వివరాలను వెల్లడించారు.
- 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
జీడిమెట్ల, మార్చి 26: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఎసీపీ జి.హనుమంతరావు, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ రావు, డీఐ విజయ్ నాయక్ వివరాలను వెల్లడించారు. గాజులరామారం డివిజన్ నెహ్రూనగర్‌కు చెందిన గోగుల దేవసహాయం (27), మెదక్ జిల్లా.. ధర్మసాగర్ గ్రామానికి చెందిన రెడ్డి రమేశ్ (27) మధ్య కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు అలవాటు పడ్డారు. తాళం వేసి ఉన్న బైక్‌లను మారు తాళం చెవితో తాళం తీసి, చోరీలకు పాల్పడ్డారు. అనంతరం చోరీ చేసిన బైక్‌లను కళావతి నగర్‌కు చెందిన మన్నెరాజు (37)కు అప్పగించి డబ్బులు తీసుకుని జల్సాలు చేశారు. సోమవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో దేవ సహాయం, రెడ్డి రమేశ్ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పోలీసుల కంటపడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 8 వాహనాలు, సూరారం పోలీస్ స్టేషన్ 4, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ 1, నర్సాపూర్ పోలీస్ స్టేషన్ 1, కామారెడ్డి పోలీస్ స్టేషన్ 1, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ 1, మెదక్ పోలీస్‌స్టేషన్ 1., మొత్తం 17 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన బైకులను మన్నెరాజుకు విక్రయించగా.. మన్నెరాజు కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన బైక్ మెకానిక్ శివకుమార్ గౌడ్‌కు విక్రయించాడు. శివకుమార్, మన్నెరాజు వద్ద నున్న 17 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

