మారేడ్‌పల్లి, డిసెంబర్ 16: ఇండ్లలో పని మనుషులుగా చేరి..యజమానులకు నమ్మకంగా ఉంటూ..వారి ఇండ్లలోనే బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను కార్ఖానా, బొల్లారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ రష్మీ పెరుమాళ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన గజవాడ శ్రీధర్ జ్యూవెల్లరి వ్యాపారి.
ఇతని ఇంట్లో నారాయణపేట జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఊరగడ్డ కిష్టయ్య, మాధవి దంపతులు పని మనుషులుగా చేరారు. అయితే.. కొంత కాలంగా ఇంట్లో బంగారు బిస్కెట్లు, ఆభరణాలు మాయం అవుతుండడం తో…ఇంటి యజమాని కార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఇంట్లో పనిచేసే కిష్టయ్య, మాధవి దంపతుల పై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దొంగిలించిన బంగారు బిస్కెట్లతో నిందితులు బంగారు ఆభరణాలు చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి 24.2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో…
బొల్లారంలోని డౌటన్ రోడ్లో నివాసం ఉండే యెల్లు సుజాత తన బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైయ్యాయని బాధితురాలు బొల్లారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించా రు. మెదక్ జిల్లా, మాచ బొల్లారం, కుమ్మరి బస్తీ ప్రాంతానికి చెందిన జాజాల సింధు అలియాస్ చిన్నారి గత నెల క్రితం సుజాత ఇంట్లో పని మనిషిగా చేరింది. కొన్ని రోజులుగా నమ్మకంగా పని చేస్తూ వచ్చింది.
ఇంటి యజమాని సుజాత తన బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను కనిపించకపోవడంతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో పని మనిషిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి వద్ద నుంచి బంగారు హారం -5.1 , కరిగించిన బంగారు ముక్క-2 తులాలు, వెండి ఆభరణాలు 61 తులాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కార్ఖానా, బొల్లారం ఇన్స్పెక్టర్లు అనురాధ, రవికుమార్, డీఐ ప్రభాకర్, డీఎస్ఐ లక్షణ్రాజ్, ఎస్ఐ నాగరా జు, సిబ్బంది ప్రవీణ్, రాజేశ్, శ్రీకాంత్, సోనీ, హరిబాబు, ప్రవీ ణ్ కుమార్, నవీన్ కుమార్, శ్రవన్‌కుమార్, స్వర్ణ, సంధ్య తదితరులు ఉన్నారు.