పలువురికి తీవ్రగాయాలు
మూలమలుపు వద్ద బైక్‌పై నుంచి పడి యువకుడు..
శామీర్‌పేట, ఫిబ్రవరి 2 : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న ది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… మూడుచింతలపల్లి మండలం, కేశవరం గ్రామానికి చెందిన బన్నీయాదవ్(21) , మణిదీప్, మధులు చిన్ననాటి స్నేహితులు. ఈ ముగ్గురు తుర్కపల్లి పారిశామ్రికవాడలోని ఓ కంపెనీలో రోజువారి కూలీలుగా పనిచేస్తున్నారు. పనికి వెళ్లేందుకు బన్నీ, మణిదీప్‌లు పల్సర్ 220 బైక్స్‌ను కొనుగోలు చేశారు. ఆదివా రం సెలవురోజు కావడంతో ముగ్గురు కలిసి మణిదీప్ బైక్‌పై మూడు చింతలపల్లి మండల కేంద్రానికి వెళ్లి తిరిగి కేశవరానికి వస్తున్నారు. బైక్‌ను బన్నీయాదవ్ నడుపుతుండగా గ్రామ శివారు ప్రాంతంలోని మూలమలుపు వద్ద ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో బన్సీయాదవ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకు రెండు కాళ్ళు విరిగిపోగా మణిదీప్‌కు తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాలీ ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి..
Hyd5
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 : ఉద్యోగం నుంచి వస్తుండగా రాంగ్రూట్లో వచ్చిన ట్రాలీఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం…కొండాపూర్ మసీద్‌బండా పీజీ హాస్టల్లో నివసించే ప్రతిభాచంద్ (25) గచ్చిబౌలిలోని ఐటీ కారిడా ర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం తెల్లావారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రతిభాచంద్ రాయల్ఇన్ఫీల్డ్పై గచ్చిబౌలి కార్యాలయం నుంచి విధులు ముగించుకొ ని మసీదుబండా వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో గచ్చిబౌలి స్టేడియం ముందు రాంగ్రూట్లో వచ్చిన పాలప్యాకెట్ల లోడ్ కలిగిన ఆటోట్రాలీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలైన ప్రతిభాచంద్ను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మా ర్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ట్రాన్స్‌పోర్టు వాహనం ఢీకొని మహిళ..
హయత్‌నగర్, ఫిబ్రవరి 2 : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాటేదాన్, టీఎన్జీఓస్ కాలనీకి చెందిన పోతులగుడి నాగమ్మ(45), కూతురు, మనుమరాలుతో కలిసి ద్విచక్రవాహనంపై హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపుకు బయలుదేరారు. మార్గమధ్యలో హయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎదుట వెనకవైపు నుంచి అతివేగం దూసుకొచ్చిన నవత ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం (ఏపీ16టీజీ5926) బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి నాగమ్మ ఎగిరి కిందపడగా పైనుంచి లారీ వెళ్లింది. దీం తో నాగమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి మనుమరాలు కిందపడడంతో స్వల్పంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో ప్రమాద స్థలం వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.