హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ బాత్రూమ్లోకి చొరబడి ఆగంతకులు సైగలు చేశారు. దీంతో వారిని పట్టుకునేందుకు విద్యార్థునులు ప్రయత్నించగా.. ఇద్దరు పరారయ్యారు. ఒక్కడు మాత్రం వారి చేతికి చిక్కాడు. దేహశుద్ధి చేసి.. అక్కడే కట్టేశారు. కళాశాల గేట్లు మూసివేసి ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఆంగతకుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా విద్యార్థులు వారిని అడుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిందితుడిని తీసుకుపోవద్దంటూ అడ్డంగా కూర్చుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు వీసీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా వర్సిటీకి చెడ్డపేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Secunderabad
#WATCH | Students of Osmania University PG College, Secunderabad, raise slogans of “We want justice” after alleged security breach at the women’s hostel last night; Police probing the matter pic.twitter.com/0tkKjVyUwD
— ANI (@ANI) January 27, 2024