మేడ్చల్, జూలై 12: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. అస్సాంకు చెంది న బాగి రాం(53) అదే ప్రాంతానికి చెందిన అజ య్, ప్రదీప్‌తో కలిసి బతుకుదెరువు కోసం ఈనెల 9న మేడ్చల్‌కు వచ్చారు. మండలంలోని రాయిలాపూర్ గ్రామ పెట్రోబంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. అజ య్, ప్రదీప్‌లు స్థానికంగా ఉన్న కంపెనీలో పనికి కుదిరారు.బాగిరాం మాత్రంఈనెల10న రాత్రి పని కోసం మేడ్చల్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. అజయ్, ప్రదీప్‌లు బాగిరాం కోసం పరిసర ప్రాంతాల్లో వెతికారు. స్వగ్రామానికి వెళ్లాడేమోనని వాకబు చేసినా అక్కడికి రాలేదని తెల్సింది. దీంతో మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కండ్లకోయ చెందిన యువతి
కండ్లకోయ చెందిన వెంకటేశ్వరీ(22) అయోధ్య చౌరస్తాలో ఉన్న అపార్ట్మెంట్లో పని చేస్తుంది. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఉండగా రాత్రి వెంకటేశ్వరికి ఫోన్ రాగానే బయటికి వెళ్లింది. మరుసటి రోజు వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అంబేద్కర్‌నగర్ చెందిన మేకల జోసెఫ్ తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
పరువు పోయిందని..
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సుతారిగూడకు చెందిన వర్గంటి శైలజ(25) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. ఆమె రెండేండ్లుగా దినకర్ అనే యువకుడిని ప్రేమించింది. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడం తో కొన్ని రోజుల నుంచి మాట్లాడటం మానేసింది. ఈనెల 9న రాత్రి దినకర్ బాగా మద్యం తాగి శైలజ ఇంటికి వచ్చి, శైలజతో పాటు కుటుంబ సభ్యులను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన శైలజ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. టీవీ దగ్గర పెట్టిన లేఖలో అందరి ముందు తన పరువు పోయిందని, ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను, తనకోసం వెతకొద్దని రాసింది. కుటుం బ సభ్యులు ఆమె సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోవడం తో కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.